close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేంద్రం వైఫల్యంతోనే ఉత్పాతం

రాహుల్‌ గాంధీ ధ్వజం

దిల్లీ: దేశంలో కరోనా కేసులు ఉత్పాతంలా పెరిగిపోవటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం ధ్వజమెత్తారు. కరోనా నియంత్రణకు సరైన వ్యూహం కరవైందంటూ విమర్శల దాడిని తీవ్రం చేశారు. ‘‘కేంద్రానికి ఉన్న వ్యూహం ఇదే.. స్టేజ్‌ 1- తుగ్లక్‌ లాక్‌డౌన్‌ విధించడం, స్టేజ్‌ 2- గంటలు మోగించడం, స్టేజ్‌-3 దేవుళ్లను స్తుతిస్తూ పాడటం’’ అంటూ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఎప్పటిలాగే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని విమర్శించారు. కరోనా భారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సూచించారు.
సుప్రీం జోక్యానికి వినతి
కరోనా ఉద్ధృతిని అదుపు చేసేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అశ్వినీ కుమార్‌ కోరారు. ప్రస్తుత సవాల్‌ను సుమోటోగా స్వీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు