close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

బండి సంజయ్‌

వరంగల్‌, న్యూస్‌టుడే: ఆత్మబలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకుంటే కేసీఆర్‌ నిజాం వారసులైన ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. హన్మకొండ కేడీసీ మైదానంలో శుక్రవారం రాత్రి ఆయన వరంగల్‌ నగర పాలక సంస్థ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తే వాటిని పక్కదారి పట్టించి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులుగా సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అమృత్‌ పథకం కింద కేంద్రం నిధులిస్తే మిషన్‌ భగీరథకు వాడుకొని, ఇంటింటికీ నీళ్లు ఇచ్చానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వరంగల్‌ నగర పాలక సంస్థపై కాషాయం జెండాను ఎగురవేస్తామన్నారు. భూకబ్జాలకు పాల్పడుతున్న ఇక్కడి ఎమ్మెల్యేకు ఈఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు