close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చేతులు జోడించి అడుగుతున్నా

బెంగాల్‌లో పోలింగ్‌ను కుదించండి
ఈసీకి దీదీ విజ్ఞప్తి

చాకులియా: పశ్చిమ బెంగాల్‌లో కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుండటంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలింగ్‌ను కుదించాలన్న తమ డిమాండ్‌ను పునఃపరిశీలించాలని ఎన్నికల సంఘానికి (ఈసీ) విజ్ఞప్తి చేశారు. ఉత్తర దినాజ్‌పుర్‌లో సోమవారం నిర్వహించిన ర్యాలీలో దీదీ ప్రసంగిస్తూ.. ‘‘చేతులు జోడించి మరీ ఈసీకి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో చివరి మూడు దశల పోలింగ్‌ను ఒకే రోజు నిర్వహించండి. లేదంటే రెండు రోజుల్లోనైనా పూర్తిచేయండి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చి ఈ మేరకు నిర్ణయం తీసుకోండి’’ అని వ్యాఖ్యానించారు. భాజపా ఆదేశాల మేరకే ఈసీ పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. కమలదళాన్ని ఆందోళనకారుల పార్టీగా అభివర్ణించారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఇకపై ఇరుకైన ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించకూడదని తమ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు మమత ప్రకటించారు. మరోవైపు, ఎన్నికల ర్యాలీలను దీదీ ఇకముందు కేవలం 30 నిమిషాల్లో ముగిస్తారని తృణమూల్‌ నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ తెలిపారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు