close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా కేకే

ఈనాడు, దిల్లీ: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నియమితులయ్యారు. పెద్దల సభ నుంచి ఇద్దరు సభ్యులను రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ప్రెస్‌కౌన్సిల్‌కు నామినేట్‌ చేశారు. అందులో తెలంగాణాకు చెందిన తెరాస సభ్యుడు కె.కేశవరావు ఒకరు కాగా మరొకరు ఒడిశాకు చెందిన భాజపా సభ్యుడు అశ్వినీ వైష్ణవ్‌.

ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యులుగా బండా, బండి, బెల్లాన
ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా 2021-22 సంవత్సరానికి రాజ్యసభ నుంచి తెరాస సభ్యుడు బండా ప్రకాశ్‌, లోక్‌సభ నుంచి కరీంనగర్‌ సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఎంపికయ్యారు. మంగళవారం రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు