close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయండి: కాంగ్రెస్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలతో పాటు మరో 5 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్‌ఈసీ)కి విజ్ఞప్తి చేసింది. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి, కన్వీనర్‌ జి.నిరంజన్‌లు ఈ మేరకు మంగళవారం ఎస్‌ఈసీ పార్థసారధికి లేఖ రాశారు.

ఐకేపీ కేంద్రాలు తెరవకుంటే ఉద్యమం: కోమటిరెడ్డి
ఐకేపీ కేంద్రాలను వెంటనే తెరిచి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎంకు లేఖ రాశారు. లేదంటే దిల్లీ తరహా రైతాంగ యుద్ధం తెలంగాణలోనూ మొదలవుతుందన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు