close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దేశంలో టీకాల కొరత సృష్టించారు: మమత

ఫరక్కా: దేశంలో టీకాల కొరతకు ప్రధాని నరేంద్రమోదీయే కారణమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. విదేశాల్లోని కొందరికి మోదీ స్వయంగా టీకాలు పంపి, దేశంలో కొరత సృష్టించారని, బహిరంగ మార్కెట్లో అమ్మకాలకు ద్వారాలు తెరిచారని విమర్శించారు. విదేశాల్లో తన ప్రతిష్ఠను పెంచుకోవడానికే మోదీ టీకాలు ఎగుమతి చేశారని, దీనివల్ల మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు టీకాల కొరతతో సతమతమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని భగవాన్‌గోలాతో పాటు సాగర్‌దిఘి, ఫరక్కా తదితర చోట్ల జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో మమత మంగళవారం ప్రసంగించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు