close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేటీఆర్‌తో మా నేతల భేటీ ఉద్దేశపూర్వకమే

లింగోజిగూడ వ్యవహారంలో వారిది తొందరపాటు చర్య
భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నిక విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసిన తమ పార్టీ బృందంలోని నాయకులు వ్యవహరించిన తీరు ఉద్దేశపూర్వకమేనని భాజపా భావిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు గానీ.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు కె.లక్ష్మణ్‌, డీకే అరుణ, మురళీధర్‌రావులకు సమాచారం ఇవ్వకుండా, చర్చించకుండా బృందం నేతలు కేటీఆర్‌ను ప్రత్యక్షంగా కలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తే వారిపై చర్యలు ఉంటాయన్నారు. పార్టీ నాయకులు ఈ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్య అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో భాజపా అఖండ విజయం సాధించిందన్నారు. లింగోజిగూడ డివిజన్‌ ఉపఎన్నికలోనూ విజయం సాధించడం ఖాయమని భావిస్తూ పోటీకి సిద్ధమైన తరుణంలో.. తమ నేతలు ఇలా చేయడం.. పార్టీ ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందని భావిస్తున్నట్లు సంజయ్‌ పేర్కొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు