close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బెంగాల్‌లో నేడు ఆరో విడత పోలింగ్‌

కోల్‌కతా: సుదీర్ఘంగా సాగుతున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం ఆరో దశ పోలింగ్‌ నిర్వహిస్తారు. మొత్తం 43 స్థానాల్లో 306 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రోజూ దాదాపు 10వేల కేసులతో కొవిడ్‌ విజృంభణ ఒకవైపు... ఎన్నికల హింసాగ్ని మరోవైపు... ఈ రెండింటి నడుమ పోలింగ్‌ జరగబోతోంది. నాలుగో విడత ఎన్నికల సందర్భంగా పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించిన నేపథ్యంలో ఈసారి భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.

ఎన్నికల్లో మార్పు కుదరదు: ఈసీ
దిల్లీ: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. షెడ్యూల్‌లో మార్పులు చేయాలన్న తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ల డిమాండ్‌ను తోసిపుచ్చింది. కొవిడ్‌ నేపథ్యంలో చివరి మూడు దశలను కలిపి ఒకే దశలో నిర్వహించాలని తృణమూల్‌ కోరగా... రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎన్నికలను వాయిదా వేసి రంజాన్‌ తర్వాత నిర్వహించాలని బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ చౌధరి కోరారు. ‘‘కొవిడ్‌ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చటం నిబంధనల మేరకు కుదరదు. అలాగే... మే 30తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తున్నందున ఎన్నికలను వాయిదా వేయటం కుదరదు’’ అని ఈసీ స్పష్టం చేసింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు