ఓటమి ఎరుగని ఊమెన్‌ చాందీ

ప్రధానాంశాలు

ఓటమి ఎరుగని ఊమెన్‌ చాందీ

12వ సారి విజయం

తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ(77)... మరో విజయాన్ని మూటగట్టుకున్నారు. ట్రావెన్‌కోర్‌ ప్రాంతంలోని పూతుపల్లి నియోజకవర్గం నుంచి 12వ సారి గెలుపొందారు. 27 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి తొలిసారి 1970లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. గత ఏడాది సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా ఐదు దశాబ్దాల ప్రస్థానం పూర్తిచేసుకున్నారు. ఏనాడూ పార్టీ మారని చాందీ... నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. తాజాగా తన సమీప ప్రత్యర్థి, సీపీఎం అభ్యర్థి జైక్‌ సి థామస్‌పై విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఎన్‌.హరి పోటీ చేశారు. పూతుపల్లే తన కార్యక్షేత్రమని, వీలైనంత వరకూ ప్రజల మధ్య ఉండటమే తన విజయ రహస్యమని చాందీ వినయంగా చెబుతుంటారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని