close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తాత కోటలో ఉదయనిధి

మిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధి మనవడు, అధినేత ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారే విజయకేతనం ఎగరవేశారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో విజయం సాధించడం ద్వారా తాతకు తగ్గ మనవడిగా నిలిచారు. ఉదయనిధి మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ఉన్నారు. అరంగేట్రంలోనే కీలక చెపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించటం విశేషం. ఈ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోటగా ఉంది. గతంలో కరుణానిధి ఈ స్థానం నుంచి 1996, 2001, 2006లో వరుసగా మూడు సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఇందులో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ స్థానాన్ని కరుణానిధి కుటుంబం అదృష్టంగా భావిస్తోంది. 2008లో చెపాక్‌, ట్రిప్లికేన్‌ ప్రాంతాలను విలీనం చేశారు. ఆ తర్వాత 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే ఇక్కడ జయకేతనం ఎగురవేసింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు