close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణ జరిపించండి

రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌ గ్రామంలోని సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూముల ఆక్రమణలపై సీబీఐతో విచారణ జరిపించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భూముల ఆక్రమణలను పరిశీలించడానికి ప్రజా సంఘాలతో కలసి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అలాగే వాటిపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆలయ భూములు 1925వ సంవత్సరం నుంచి ఎన్ని చేతులు మారాయో ప్రభుత్వం నిగ్గుతేల్చాలన్నారు. ఈ భూముల్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్న మంత్రులను పదవుల నుంచి తొలగించి విచారణ చేపట్టాలన్నారు. ఈ భూములను అడ్డం పెట్టుకుని తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన దేవాదాయ భూముల వివరాలను ధరణి పోర్టల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సర్వే నంబరు 437 నిషేధిత భూముల జాబితాలో ఉందన్నారు. దేవాదాయశాఖకు చెందిన భూముల సర్వే నంబర్లను ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టలేదని ఆయన నిలదీశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు