భూదందాలపై కాంగ్రెస్‌ పోరాటం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భూదందాలపై కాంగ్రెస్‌ పోరాటం

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూదందాకు పాల్పడిన వారిని శిక్షించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భూ ఆక్రమణలకు పాల్పడినవారికి శిక్షపడే వరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందన్నారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ‘గరిబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు’ పేరుతో ఏర్పాటుచేసిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ గిరిజనులు, దళితులకు లక్షల ఎకరాల భూములను ఇచ్చిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దగా చేసింది తెరాస ప్రభుత్వమని ఆరోపించారు. దళితుల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని తెరాస నాయకులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కొందరు మంత్రులే కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు.
సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయాలి: సంపత్‌
రాష్ట్రంలో భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయని, వీటిపై సిట్టింగ్‌ జడ్జితోగానీ, సీబీఐతో గానీ విచారణ చేయించాలని సంపత్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ ప్రభుత్వ, దళితుల భూములను, దేవుడి మాన్యాలను ఆక్రమించుకోవడం శోచనీయమని మండిపడ్డారు. మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డిలపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు