మీ బలహీనత దేశం మొత్తానికీ తెలుసు..!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ బలహీనత దేశం మొత్తానికీ తెలుసు..!

ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన జేఎంఎం

ఈనాడు, అమరావతి: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఆక్షేపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్‌కు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. దీనిపై జేఎంఎం తూర్పు సింగ్‌భమ్‌ జిల్లా శాఖ స్పందించింది. ‘మీ బలహీనతేమిటో దేశం మొత్తానికి తెలుసు. మేమంతా చాలా ప్రేమ, గౌరవ భావం కలిగి ఉంటాం. మీరు సుఖంగా, క్షేమంగా ఉండాలని కాంక్షిస్తున్నాం’ అని పేర్కొంది. ‘ఏపీ సీఎం బెయిల్‌ రద్దుపై విచారణ వాయిదా’ అని ఉన్న వార్త క్లిప్పింగ్‌, హేమంత్‌ సోరెన్‌ను ఆక్షేపిస్తూ, మోదీకి మద్దతుగా జగన్‌ చేసిన ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను పక్కపక్కనే పెట్టింది. ఆ చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేసి పై వ్యాఖ్యలను జోడించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు