సంపత్‌ కుమార్‌వి నిరాధార ఆరోపణలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపత్‌ కుమార్‌వి నిరాధార ఆరోపణలు

 ఉత్తమ్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ దురుద్దేశంతో తనపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. లేకుంటే సంపత్‌పై చట్టపరమైన చర్యల కోసం న్యాయస్థానానికి వెళతామని తెలిపారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఉత్తమ్‌ సమక్షంలో సంపత్‌ ఆరోపణలు చేస్తుంటే  ఆయన స్పందించకపోవడం దారుణమన్నారు. తనకున్న మొత్తం భూమి 50 ఎకరాల లోపేనని, 200 ఎకరాలు ఉందని సంపత్‌ ఆరోపించడం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. వనపర్తి, పెబ్బేరు పట్టణాలలోని భూములపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో ఇచ్చినట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు