ప్రజల మృత్యుఘోష వినబడట్లేదా?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజల మృత్యుఘోష వినబడట్లేదా?

  ఏపీ ప్రభుత్వంపై తెదేపా ధ్వజం  
 ప్రజలకు టీకాలు వేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతల నిరసన

ఈనాడు, అమరావతి: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చీమ కుట్టినట్టయినా లేదని ఆ రాష్ట్ర తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. కరోనా వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ‘వ్యాక్సిన్‌ వేయండి- ప్రజల ప్రాణాలు కాపాడండి’ అన్న నినాదంతో ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 151 శాసనసభ స్థానాల పరిధిలోని, 455 మండలాల్లో కార్యక్రమం కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ఎవరు ఇళ్ల వద్ద వారు నిరసన తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఆచ్చెన్నాయుడు విశాఖలోని పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేశారు. ‘ఈ ముఖ్యమంత్రి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజారోగ్యంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షంపై కక్షసాధిస్తున్నారు. విలువైన సలహాలు ఇచ్చినందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు. జగన్‌ స్థానంలో ఇంకెవరు ముఖ్యమంత్రిగా ఉన్నా.. పూర్తి యంత్రాంగాన్ని కరోనా నియంత్రణపైనే పెట్టేవారు. కరోనా మొదటి డోసు టీకా ఇవ్వలేమని మంత్రులు బాహాటంగా చెప్పడం దారుణం. వ్యాక్సిన్ల కొనుగోలులో కమీషన్లు రావని మంత్రులు నీచంగా వ్యవహరిస్తున్నారు. పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ కొనుగోలుకు ఆర్డర్లు పెడితే మన ముఖ్యమంత్రికి పట్టదు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద దేశవ్యాప్తంగా పెడుతున్న వెయ్యి ఆక్సిజన్‌ ప్లాంట్లలో ఒక్కటి కూడా రాష్ట్రానికి కేటాయించకపోయినా పట్టించుకోని జగన్‌... ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండించడాన్ని ఏమనుకోవాలి? కర్నూలులో ప్రమాదకరమైన వైరస్‌ ఉందని శాస్త్రవేత్తలు చెప్పిందే చంద్రబాబు ఉద్ఘాటించారు’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు