ఈటలను కలిసిన తెరాస మహిళా నేత?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటలను కలిసిన తెరాస మహిళా నేత?

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస సీనియర్‌ మహిళా నాయకురాలు ఒకరు శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో ఆయన నివాసంలో భేటీ అయినట్లు తెలిసింది. ఆమె గతంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. పార్టీలో రాష్ట్రస్థాయి మహిళా నేతగా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ పదవితో పాటు నియమిత పదవుల కోసం ఆమె ప్రయత్నించారు. దక్కలేదు. అసంతృప్తితో ఉన్న ఆమె ఈటలను కలిసినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఆమె వివరణ కోసం ప్రయత్నించగా స్పందించలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు