ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి: అసదుద్దీన్‌ ఒవైసీ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి: అసదుద్దీన్‌ ఒవైసీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, ఈనాడు, దిల్లీ: ఆసుపత్రుల్లో పడకలు, ప్రాణవాయువు కొరతతో అయినవారిని కోల్పోతున్న ప్రజలందరికీ ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. పార్లమెంటును, పాత్రికేయుల్ని ఎదుర్కొనేందుకు మోదీ భయపడుతున్నారంటూ ఒవైసీ ఆదివారం ట్వీట్‌ చేశారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం గందరగోళంగా ఉన్నందున ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలన్నారు.  దేశంలోని మిగతా కంపెనీలూ వ్యాక్సిన్లు తయారు చేసే విధానాన్ని అమలు చేయడం లేదేమని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు