ప్రణాళికాలోపంతోనే వ్యాక్సినేషన్‌లో అట్టడుగున ఏపీ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రణాళికాలోపంతోనే వ్యాక్సినేషన్‌లో అట్టడుగున ఏపీ

  జగన్‌ అసమర్థత వల్ల ఆక్సిజన్‌ అందక 76మంది బలి
  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వ్యాక్సినేషన్‌పై ఏపీ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలోనే రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఆక్సిజన్‌ అందక ఇప్పటివరకు 76మంది చనిపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా రూ.2లక్షల పరిహారమివ్వాలని కోరారు. పార్టీ ముఖ్య నేతలు, మండల పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో 29మంది వరకు చనిపోయారనే వార్తలొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో వాస్తవాల వెల్లడికి పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటుచేశామన్నారు. ఆక్సిజన్‌ అందక మరణించిన రోగుల కుటుంబాలకు సంఘీభావంగా బుధవారం ఇళ్ల వద్ద తెదేపా కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలు పెద్దమొత్తంలో వ్యాక్సిన్లు కొనుక్కుంటుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం లేఖలు రాయటంతోనే సమయం వృథా చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో మూడో దశ వ్యాక్సిన్‌ పంపిణీకి రూ.1,600కోట్లు అవసరం కాగా జగన్‌రెడ్డి మాత్రం రూ.45కోట్లతో సరిపెట్టారన్నారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు