టీకా ఉత్సవం జరిపారు.. వ్యాక్సిన్లు సమకూర్చలేకపోయారు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా ఉత్సవం జరిపారు.. వ్యాక్సిన్లు సమకూర్చలేకపోయారు!

 కేంద్రంపై ప్రియాంక విమర్శలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ‘టీకా ఉత్సవ్‌’ను నిర్వహించినప్పటికీ ప్రజలకు టీకాలను సమకూర్చడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం విమర్శించారు. ఎక్కువ మంది టీకాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు గాను ఏప్రిల్‌ 11-14 మధ్య కేంద్ర ప్రభుత్వం టీకా ఉత్సవ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ‘‘భారత్‌ అత్యధిక టీకాలు ఉత్పత్తి చేసే దేశం. కానీ 30 రోజుల్లో వ్యాక్సినేషన్లు 82 శాతం పడిపోయాయి’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 12, మే 9 తేదీల్లో పోలిక చేస్తూ వ్యాక్సినేషన్ల గణాంకాలతో కూడిన గ్రాఫిక్స్‌ను ఆమె చూపించారు. అలాగే పౌరులకు టీకాలు వేయడంలో అమెరికా, బ్రిటన్‌, టర్కీ, ఫ్రాన్స్‌ దేశాల కంటే భారత్‌ వెనుకబడిపోయిన అంశాన్ని చూపిస్తూ మరో గ్రాఫ్‌ను కూడా చూపించారు. ప్రధాని మోదీ టీకా పరిశ్రమలకు వెళ్లి ఫొటోలు తీసుకున్నారని.. కానీ ఆయన ప్రభుత్వం జనవరిలోనే తగినంతగా టీకా డోసులకు ఎందుకు ఆర్డర్‌ ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. టీకాలు ప్రతి ఇంటికీ అందేలా చేయలేకపోతే కొవిడ్‌తో పోరు సాధ్యం కాదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు