ఆపదలోని మహిళలకు తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ టీం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆపదలోని మహిళలకు తోడుగా వైఎస్‌ఎస్‌ఆర్‌ టీం

ఫోన్‌ నంబరు ప్రకటించిన షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కారణంగా కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన మహిళలను ఆదుకునేందుకు ‘వైఎస్‌ఎస్‌ఆర్‌ టీం’ను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్‌ షర్మిల శుక్రవారం ప్రకటించారు. 040- 48213268 నంబరుకు బాధితులు స్వయంగా ఫోన్‌ చేయవచ్చని, లేదా ఇతరులెవరైనా బాధితుల సమాచారాన్ని తెలియజేయవచ్చని సూచించారు. కరోనాతో జీవిత భాగస్వాములను, బిడ్డలను కోల్పోయి ఆధారంలేక ఎంతోమంది మహిళలు కుంగిపోతున్నారని తెలిపారు. ఎందరి జీవితాలనో ఈ మహమ్మారి చిన్నాభిన్నం చేసిందని పేర్కొన్నారు. అలాంటివారిని కొంతైనా ఆదుకోవాలనేదే తన లక్ష్యమని వివరించారు. 17 ఏళ్ల క్రితం 2004 మే 14న సీఎంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేస్తూ.. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనను తీసుకొస్తానని షర్మిల తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు