లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరే చర్యలు చేపట్టండి: తమ్మినేని
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరే చర్యలు చేపట్టండి: తమ్మినేని

లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ప్రజలు గుమిగూడకుండా ప్రత్యామ్నాయ చర్యలు అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో సూచించారు. కేవలం నిత్యావసర సరకులు, కూరగాయాల మార్కెట్లు మాత్రమే తెరిచి మిగతా దుకాణాల్ని మూసేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నాయని ఆన్‌లైన్‌లో చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. అందుకే ఆసుపత్రుల ముందే ఖాళీల గురించి డాష్‌బోర్డులు ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫీవర్‌ సర్వేలో 1.8లక్షల మంది జ్వర లక్షణాలను గుర్తించామని చెబుతున్నందున మండల స్థాయి వరకు ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు