మానవతతో అంబులెన్సుల్ని అనుమతించాలి : చాడ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మానవతతో అంబులెన్సుల్ని అనుమతించాలి : చాడ

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అంబులెన్సుల్లో వస్తున్న రోగులను సరిహద్దుల్లో ఆపకుండా మానవీయ కోణంలో అనుమతించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. హైకోర్టు కూడా మానవతా దృక్పథంతో రోగుల్ని ఆపొద్దని వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు.  పిల్లల్లోనూ కరోనా విజృంభిస్తున్నందున ఎంబీబీఎస్‌ వైద్యులకు రూ.లక్ష, ఆయుష్‌ వైద్యులకు రూ.90వేలు, పారామెడికల్‌ సిబ్బందికి కనీస వేతనం ఇచ్చి మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్‌ తన ప్రకటనకు కట్టుబడి కరోనాకు ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందించాలని కోరారు. సీపీఐ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు