కొవిడ్‌ బాధితులకు అండగా నిలవండి: ఏఐసీసీ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ బాధితులకు అండగా నిలవండి: ఏఐసీసీ

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో బాధితులు, ప్రజలకు అండగా నిలవాలని పీసీసీ, జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు, యువజన కాంగ్రెస్‌ బాధ్యులను కోరుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం లేఖ రాశారు.  పార్టీ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సులు, టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందులు, ఆహారాన్ని అవసరార్థులకు అందజేయాలని సూచించారు.  
బాధితులను సరిహద్దుల్లో ఆపొద్దు
కరోనా రోగులను తెలంగాణలోకి అనుమతించే విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌పై ఏపీకి మరో మూడేళ్లపాటు హక్కు ఉందన్న విషయం తెలంగాణ సర్కారు, పోలీసులు గుర్తుంచుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ పేర్కొన్నారు.  కరోనా విపత్తు సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి వైద్యానికి ఇక్కడికి వచ్చే వారిని సరిహద్దుల్లో అడ్డుకోకుండా చూడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ సక్రమ సరఫరా లేకనే కరోనాతో ప్రజలు మృతిచెందుతున్నారని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు