కరోనాకు ఉచిత వైద్యం అందించండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు ఉచిత వైద్యం అందించండి

 ‘రాహుల్‌గాంధీ కేర్‌’తో బాధితులను ఆదుకుంటాం
 పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా రెండో దశపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం నేపథ్యంలో ఆరంభిస్తున్న ‘రాహుల్‌గాంధీ కేర్‌’ కార్యక్రమం దేశవ్యాప్తంగా కొవిడ్‌ బాధితులను ఆదుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం తన నివాసంలో ‘రాహుల్‌గాంధీ కేర్‌’ పోస్టర్‌ను ఉత్తమ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ‘‘కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వాలు విఫలమవ్వడంతోనే కాంగ్రెస్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ర్యాపిడ్‌ పరీక్షల్లో వైరస్‌ బయటపడటం లేదు. దీంతో బాధితులు సాధారణ ప్రజలతో కలిసే ఉంటున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించాలి. ప్రైవేటు అంబులెన్సు ఎక్కాలంటే పేదల జేబు ఖాళీ అవుతోంది. ఆక్సిజన్‌ పడక కావాలంటే ప్రైవేటులో రోజుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాల్సి వస్తోంది. దీన్ని పేదలెలా భరిస్తారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటన ఇంతవరకు అమలవలేదు. కొవిడ్‌కు ఏపీ, తమిళనాడులలో ఉచిత చికిత్స అందిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదు? ప్రస్తుతం వెంటిలెటర్స్‌ పడకలు లేక రాష్ట్రంలో చాలామంది మృత్యువాత పడుతున్నారు. హెటిరో డ్రగ్స్‌కు రూ.వేల కోట్ల భూములను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లకు కొరత ఏర్పడినా సర్కారు స్పందించడం లేదు. రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడం దారుణం’’ అని ఉత్తమ్‌ తప్పుపట్టారు. పాత్రికేయులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని ఆయన సూచించారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే తాము 246 మందికి ప్లాస్మా, 500 మందికి ఆక్సిజన్‌ అందజేసినట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు