వైద్య సిబ్బంది కొరతతోనే అనర్థాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్య సిబ్బంది కొరతతోనే అనర్థాలు

కొవిడ్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌; హుజూరాబాద్‌, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, కరోనా పరీక్షల కిట్ల కొరత లేదని మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారు. వైద్య సిబ్బంది కొరత లేదంటున్నారు. మరి ఇంతమంది ప్రజలు ఎందుకు చనిపోతున్నారు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. శుక్రవారం హుజూరాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. రెండు చోట్లా విలేకరులతో మాట్లాడారు. గురువారం రాత్రి ఓ బాధితురాలికి ఆక్సిజన్‌ లేకుండా ఖాళీ సిలిండర్‌ను పెట్టడంతో ఆమె మరణించినట్టు వరంగల్‌లో కొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డిని సంజయ్‌ ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని ఆయన జవాబిచ్చారు. ‘‘ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు’’ అని సంజయ్‌ మండిపడ్డారు. ‘‘మహమ్మారి తీవ్రరూపం దాల్చినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమించకపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
* ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 8వ విడతగా తెలంగాణ రైతులకు డబ్బులు జమ అయ్యాయని సంజయ్‌ తెలిపారు.  రామగుండం ఎరువుల ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాను తెలంగాణ రైతులకే అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది’’ అని ఒక ప్రకటనలో తెలిపారు. వీర, శైవ, లింగాయత్‌లకు బసవేశ్వరుడి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు