రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొవిడ్‌ వ్యాప్తి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొవిడ్‌ వ్యాప్తి

జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు బండి సంజయ్‌ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో వ్యాప్తి పెరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.పేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ప్రైవేటులో చికిత్సకు ఆస్తులు అమ్ముకుంటూ అప్పుల్లో కూరుకుపోతున్నారని..పలువురు చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ తమిళిసైకు ఆయన విజ్ఞప్తిచేశారు. వినతిపత్రాన్ని ఈమెయిల్‌ ద్వారా గవర్నర్‌కు ఆదివారం పంపారు. దీనివల్ల రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కొవిడ్‌ చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలన్నారు. కరోనా రోగుల్ని వెనక్కి పంపకుండా ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యపథకం ఆయుష్మాన్‌భారత్‌ని తెలంగాణలో అమలుచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు నిధులు కేటాయించేలా సర్కారును ఆదేశించాలని గవర్నర్‌ను సంజయ్‌ కోరారు. ‘ఆయుష్మాన్‌భారత్‌’ పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించి ఏడాది అవుతోందని, 2020 డిసెంబరులో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో ఏర్పాటుచేసిన వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో అమలుచేస్తామని చెప్పినా ఒక్క అడుగూ ముందుకు పడలేదని లేఖలో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు