కేసీఆర్‌ వైఖరితోనే రాష్ట్రంలో ఉపద్రవం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌ వైఖరితోనే రాష్ట్రంలో ఉపద్రవం

 ప్రైవేటు ఆసుపత్రులు దోచేస్తున్నాయ్‌
 పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఉత్తమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనాలోచిత, నిర్లక్ష్య వైఖరితోనే రాష్ట్రంలో కరోనా ఉపద్రవంలా మారిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైద్యానికి కార్పొరేట్‌ ఆసుపత్రులకు పోతే పీల్చి పిప్పి చేస్తున్నాయన్నారు. ఆదివారం సామాజిక మాధ్యమం ద్వారా నిర్వహించిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులతోనూ మాట్లాడారు. ఆదివారం కరోనాతో మరణించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్‌ సతావ్‌కు పీసీసీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఉత్తమ్‌ మాట్లాడుతూ... ‘‘పొరుగు రాష్ట్రాలు ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ఉచితంగా వైద్యం అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆయుష్మాన్‌ భారత్‌ను కానీ, ఆరోగ్యశ్రీని కానీ అమలు చేయడం లేదు. ఇక్కడ వ్యాక్సిన్‌ తయారవుతున్నా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేదు. దేశం మొత్తంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ నగరంలోనే తయారవుతున్నా మనకు దొరకడం లేదు. ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌ పోరాటం చేస్తుంది’’ అని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీభవన్‌ అంబులెన్సులను ఉపయోగించుకోండి
ఈ నెల 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఉత్తమ్‌ కోరారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన రెండు అంబులెన్సులను నగర వాసులు గాంధీభవన్‌కు ఫోన్‌ చేసి వినియోగించుకోవాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు