నవనీత్‌ కౌర్‌ ఎస్సీ కాదు!

ప్రధానాంశాలు

నవనీత్‌ కౌర్‌ ఎస్సీ కాదు!

బాంబే హైకోర్టు తీర్పు
ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం

ముంబయి, దిల్లీ: మహారాష్ట్రలోని అమ్రావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీ నటి నవనీత్‌ కౌర్‌ రాణాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కుల ధ్రువీకరణ కోసం నకిలీ పత్రాలు సమర్పించినందుకుగానూ రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. నవనీత్‌ కౌర్‌ చేతిలో ఓడిపోయిన శివసేన నేత ఆనంద్‌రావ్‌ అద్సులే దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో ఆమె ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎస్సీ రిజర్వ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే నవనీత్‌ కౌర్‌ నకిలీ పత్రాలు సమర్పించి ఈ మోసానికి పాల్పడ్డారని, వాటిలో పేర్కొన్నట్లు ఆమెది మోచి సామాజిక వర్గం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పత్రాలను ఆరు వారాల్లోగా తమకు అప్పగించాలని, జరిమానాను రెండు వారాల్లోపు మహారాష్ట్ర న్యాయ సేవల సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. నవనీత్‌ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆనంద్‌రావ్‌ తొలుత ముంబయి జిల్లా కుల ధ్రువీకరణ నిర్ధరణ కమిటీలో ఫిర్యాదు చేశారు. అయితే ఆ కమిటీ నవనీత్‌ కౌర్‌కే అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఆనంద్‌రావ్‌ హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తానని నవనీత్‌ కౌర్‌ తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శివసేనపై పదేళ్లుగా పోరాడుతున్నానని చెప్పారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని