కర్ణాటకలో నాయకత్వ మార్పు తథ్యమా?

ప్రధానాంశాలు

కర్ణాటకలో నాయకత్వ మార్పు తథ్యమా?

అభిప్రాయ సేకరణలో అధిష్ఠానం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్పను మార్చాలంటూ డిమాండు చేస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండటంతో హస్తిన నేతలు అభిప్రాయసేకరణకు సిద్ధమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు భూపేంద్రయాదవ్‌, అరుణ్‌సింగ్‌ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్లు, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, సదానందగౌడతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుల నుంచి ముఖ్యమంత్రిపై అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. వారిచ్చే నివేదికలను త్వరలో అధిష్ఠానానికి పంపనున్నారు. దీనికనుగుణంగా పార్టీ బాధ్యుడు అరుణ్‌సింగ్‌ బెంగళూరుకు వచ్చి తాజా పరిణామాలపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మద్దతుదారులంతా తమ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి పంపేందుకు యత్నిస్తున్నారని సమాచారం. భాజపా శాసనసభాపక్ష సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తే తమ సమస్యలను చెబుతామని పలువురు శాసనసభ్యులు పట్టుబడుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని