Mamata: మోదీని గద్దె దించడమే లక్ష్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mamata: మోదీని గద్దె దించడమే లక్ష్యం

 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో  రైతులకు మద్దతుగా ర్యాలీలు
  మమతా బెనర్జీ వెల్లడి

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే తన లక్ష్యమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినాయకురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. కొత్త సాగు చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా ప్రతిపక్షాలు పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో ర్యాలీలు చేపడతామని ఆమె వాగ్దానం చేశారు. తమ ఆందోళనకు మద్దతివ్వాలని కోరుతూ రాకేశ్‌ టికాయిత్‌, యుధ్‌వీర్‌ సింగ్‌ల నేతృత్వంలోని రైతు సంఘాల నేతలు బుధవారం కోల్‌కతాలో మమతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంపై ధ్వజమెత్తారు. రాష్ట్రాల హక్కులను కాలరాయడం సమాఖ్య విధానానికి మంచిది కాదన్నారు. విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు రాష్ట్రాలకు వేదిక ఉండాలన్నారు. సమావేశం అనంతరం రైతుల ఉద్యమానికి ఆమె మద్దతు ప్రకటించారు. రైతుల సమస్యలపై ఇతర రాష్ట్రాల నేతలతో చర్చించాలని, రైతు సంఘాలతో చర్చలు జరపాలని రైతు నేతలు తనను కోరినట్లు తెలిపారు.   రైతుల బీకేయూ ప్రధాన కార్యదర్శి యుధ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పాటు, రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం.. కనీస మద్దతు ధర అందించాలని కోరడం పట్ల మమతకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షాల్లో ఉన్న శూన్యతను అవకాశంగా మలచుకుని రైతు ఉద్యమానికి మద్దతివ్వడం ద్వారా దేశమంతటా విస్తరించాలని టీఎంసీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు