పెట్రోల్‌ బంకుల వద్ద నేడు కాంగ్రెస్‌ ఆందోళనలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌ బంకుల వద్ద నేడు కాంగ్రెస్‌ ఆందోళనలు

ధరలు తగ్గించాలని డిమాండ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్‌ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీశ్రేణులను కోరారు. నాంపల్లిలో జరిగే కార్యక్రమంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం డీసీసీ కార్యాలయం వద్ద భట్టివిక్రమార్క, ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు.
కరోనా, బ్లాక్‌ ఫంగస్‌లపై అవగాహన సదస్సు రేపు
కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి శనివారం సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ’, ‘వెంకట్‌ బల్మూరి’ పేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా లింక్‌ను సూచిస్తామన్నారు. దివ్యాంగులకు ఇంటి వద్దనే కరోనా వ్యాక్సిన్‌ వేయాలని కాంగ్రెస్‌ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తినేని వీరయ్య ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు