రిజిస్ట్రేషన్‌ లేకున్నా టీకా వేయాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిజిస్ట్రేషన్‌ లేకున్నా టీకా వేయాలి

ఇంటర్‌నెట్‌ లేనివారికీ జీవించే హక్కుందన్న రాహుల్‌

దిల్లీ: కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. టీకా వేసుకోవాలంటే కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరన్న నిబంధనపై ధ్వజమెత్తారు. ఈ నిబంధన కారణంగా డిజిటల్‌ సౌకర్యం, స్మార్ట్‌ఫోన్లు లేని పేదలు, మారుమూల గ్రామీణులు టీకా పొందలేకపోతున్నారన్నారు. ఇంటర్‌నెట్‌ వసతి లేని వారికీ జీవించే హక్కు ఉంటుందని, రిజిస్ట్రేషన్‌తో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌ కేంద్రానికి వచ్చిన వారందరికీ టీకా వేయాలంటూ ట్వీట్‌ చేశారు. ఇంటర్‌నెట్‌ అందుబాటులో లేని ప్రాంతాల వారికి టీకా అందేలా కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని