బోనులో పులితో స్నేహం చేయం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోనులో పులితో స్నేహం చేయం

భాజపా నేత పాటిల్‌ వివరణ

పుణె: ‘పులితో స్నేహం’ వ్యాఖ్యలపై మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ వివరణిచ్చారు. ఈ వ్యాఖ్యలను శివసేన పార్టీనుద్దేశించి చేయలేదని తెలిపారు. అయినా తమ పార్టీ.. బోనులో బందీ అయిన పులితో స్నేహం చేయదని అన్నారు. ‘‘ఇటీవల ఓ కార్యక్రమంలో పులి బొమ్మను బహుమతిగా ఇచ్చారు. ఆ సందర్భంగా పులితో మాకు ఎప్పుడూ స్నేహమేనని చెప్పాను. దాన్ని శివసేన పార్టీ గుర్తుతో మీడియా అనుసంధానించింది. నిజమే.. మేం పులులతో స్నేహం చేస్తాం. అయితే అడవిలో స్వేచ్ఛగా తిరిగే వాటితో చేస్తాం. బోనులో బందీగా ఉన్న వాటితో కాదు’’ అని పాటిల్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు