భాజపాలోకి వెళ్లి ఏం చేస్తారు?
close

ప్రధానాంశాలు

భాజపాలోకి వెళ్లి ఏం చేస్తారు?

పెట్రోలు ధరలు తగ్గిస్తారా?
రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు తెప్పిస్తారా?
ఈటలకు ఓటమి భయం పట్టుకుంది
ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబుతారు.. శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం ఈటల రాజేందర్‌ నిరాశానిస్పృహలకు లోనయ్యారని, ఓటమి తప్పదనే భయంతో తెరాసపై, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌, తెరాస లేకుంటే ఆయనకు మనుగడే లేదన్నారు. భాజపా భూ స్థాపితం అవుతుందన్న ఈటల...ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలన్నారు. పెట్రోలు ధరలు తగ్గిస్తారా? రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు తెప్పిస్తారా? అని ప్రశ్నించారు. వరవరరావుని జైలులో పెట్టిన పార్టీలో ఎలా చేరుతున్నారని నిలదీశారు. హుజూరాబాద్‌కు ఈటల చేసిన అన్యాయాన్ని ప్రజలు మరిచిపోరని, ఒక్కరినీ ఎదగనీయకుండా నియంత పోకడలను ప్రదర్శించింది ఆయనేనని ఆరోపించారు. ఉప ఎన్నికలో ఈటలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి చెప్పారు. పేదల భూములు ఆక్రమించి ఆస్తులు కూడబెట్టుకున్న రాజేందర్‌కు ధర్మం, నీతి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. శనివారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన ఎంపీ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, కాలేరు వెంకటేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘మళ్లీ పోటీచేస్తే ఓడిపోతానని తెలిసి ఈటల భయపడ్డారు. చివరికి అందరూ ఒత్తిడి చేయడంతో రాజీనామా చేశారు. ఈ సందర్భంలో సీఎంపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..అన్నం పెట్టిన పార్టీని, బతుకునిచ్చిన నాయకుడిని విమర్శించడం దారుణం.
అభివృద్ధిని అడ్డుకునే పార్టీలో చేరారు  
కేసీఆర్‌ బొమ్మతోనే ఆరుసార్లు ఈటల గెలిచారు తప్ప సొంతబలం లేదు. పార్టీలోకి రాకముందు... వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయనను బీసీగా గౌరవించి టికెట్‌ను ఇవ్వడమే కాదు గెలిపించి, శాసనసభాపక్షనేతగా కేసీఆర్‌ నియమించారు. మంత్రి పదవిచ్చి ఏడేళ్లుగా తన పక్కన కూర్చోబెట్టుకున్నా ఈటల మారలేదు. పార్టీ నుంచి ఎందుకు పోవాల్సి వచ్చిందో ఆయన ఆలోచించుకోవాలి. హుజూరాబాద్‌లో కురుక్షేత్ర, కౌరవ పాండవ యుద్ధం అంటున్న ఈటల అందులో తాను పోషించే పాత్ర ఏమిటో చెప్పాలి. అక్కడ జరిగేది అభిÅవృద్ధి చేసే పార్టీ... అభివృద్ధిని అడ్డుకునే వారికి మధ్య పోటీ. ఇన్నిరోజులు హుజూరాబాద్‌ అభివృద్ధి చెందలేదని చెబుతున్న ఈటల.. దానికి బాధ్యత వహించాలి. తెలంగాణ అభివృద్ధికి సహకరించని భాజపాలో చేరబోతున్న ఈటల అందులో చేసేదేమీ ఉండదు. పది రోజుల్లోనే దుకాణం బంద్‌’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని