పీసీసీ అధ్యక్షుడి నియామకానికి పరిశీలకులను పంపండి: వీహెచ్‌
close

ప్రధానాంశాలు

పీసీసీ అధ్యక్షుడి నియామకానికి పరిశీలకులను పంపండి: వీహెచ్‌

విద్యానగర్‌, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం పరిశీలకులను పంపాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ అంబర్‌పేటలోని నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలో ఇటీవల చేరిన వ్యకిని అధ్యక్షుడిగా నియమిస్తే సీనియర్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానాన్ని కోరారు. తనను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు కుట్రలు జరుగుతున్నాయని వీహెచ్‌ ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని