నేడు ఎల్‌.రమణ కార్యాచరణ వెల్లడి
close

ప్రధానాంశాలు

నేడు ఎల్‌.రమణ కార్యాచరణ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ సైకిల్‌ దిగి కారెక్కేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ మార్పు వ్యవహారంపై జగిత్యాలలోని తన కార్యాలయంలో కొంతమంది సన్నిహితులు, నాయకులతో ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. వారిలో ఎక్కువ మంది తెరాసలో చేరాలనే అభిప్రాయాల్ని వెల్లడించారు. దీంతో రమణ తెరాస తీర్థం పుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించేందుకు సోమవారం జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని