సీఎం పదవి కోసం ఈటల ఆశపడ్డారు: మంత్రి గంగుల
close

ప్రధానాంశాలు

సీఎం పదవి కోసం ఈటల ఆశపడ్డారు: మంత్రి గంగుల

హుజూరాబాద్‌ గ్రామీణం, హుజూరాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమ బిడ్డగా సీఎం కేసీఆర్‌ పక్కన కూర్చోబెట్టుకుంటే.. ఆ పదవి ఎప్పుడు వస్తుందని ఈటల రాజేందర్‌ ఆశపడ్డారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌లో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కాదని.. ఆస్తుల కోసం వచ్చినవన్నారు. ఎదుటివారు సంతోషపడితే ఈటల రాజేందర్‌ ఓర్వలేరన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని