Eatala: నేడు భాజపాలోకి ఈటల
close

ప్రధానాంశాలు

Eatala: నేడు భాజపాలోకి ఈటల

సభ్యత్వం తీసుకున్నాక జేపీ నడ్డాతో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బృందం సోమవారం హస్తినలో కాషాయ కండువా కప్పుకోనుంది. భాజపా జాతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటల తర్వాత ఈటల రాజేందర్‌, ఇతర నేతలు భాజపా సభ్యత్వం తీసుకుని.. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. తనతోపాటు పార్టీలో చేరే నేతలు, భాజపా నాయకులు దిల్లీ వెళ్లడానికి రాజేందర్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈటల రాజేందర్‌ 15న దిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగిరానున్నారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని