ఎమ్మెల్సీలుగా నలుగురి పేర్లకు ఏపీ గవర్నర్‌ ఆమోదం
close

ప్రధానాంశాలు

ఎమ్మెల్సీలుగా నలుగురి పేర్లకు ఏపీ గవర్నర్‌ ఆమోదం

ఈనాడు, అమరావతి: గవర్నర్‌ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఏపీ ప్రభుత్వం పంపిన నలుగురి పేర్లకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ఆమోదముద్ర వేశారు. మోసేను రాజు, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్‌ యాదవ్‌ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం విదితమే. ఆ నలుగురిని నియమిస్తూ గెజిట్‌ ప్రకటన జారీ కావాల్సి ఉంది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని