సాక్షులను పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
close

ప్రధానాంశాలు

సాక్షులను పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

 జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై రఘురామకృష్ణరాజు

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవులు కట్టబెడుతూ సాక్షులను పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం సీబీఐ కోర్టుకు నివేదించారు. బెయిలు రద్దు పిటిషన్‌పై జగన్‌ దాఖలు చేసిన కౌంటరుకు రఘురామకృష్ణరాజు కౌంటరు దాఖలు చేశారు. తనపై కేవలం ఎఫ్‌ఐఆర్‌లే నమోదయ్యాయని, ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా అభియోగపత్రం దాఖలు చేయలేదని ఎంపీ చెప్పారు. సీబీఐ కేంద్రం అధీనంలో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందులోని వ్యక్తుల నియంత్రణ భిన్నంగా ఉంటుందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సీబీఐ అధికారులే విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించిన సంఘటనలున్నాయని చెప్పారు. ఆ సంస్థలో దర్యాప్తుతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల విశ్వసనీయత ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. బెయిల్‌ రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌లోని అంశాలను పరిశీలించకుండానే సీబీఐ తిరస్కరించడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని