కేంద్ర సర్కారు తప్పిదాలతోనే అధిక మరణాలు: అసదుద్దీన్‌ ఒవైసీ
close

ప్రధానాంశాలు

కేంద్ర సర్కారు తప్పిదాలతోనే అధిక మరణాలు: అసదుద్దీన్‌ ఒవైసీ

అబిడ్స్‌, న్యూస్‌టుడే: కేంద్రంలోని మోదీ సర్కారు అజాగ్రత్త, తప్పిదాల వల్లే కరోనా రెండో దశలో ఎక్కువ మరణాలు సంభవించాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. మృతుల సంఖ్య దాదాపు 20 లక్షలకు పైగా ఉంటుందని ఓ జాతీయ మ్యాగజైన్‌ పేర్కొనడాన్ని దేశంలోని మేధావులు, ప్రముఖులు ఏకీభవిస్తున్నారన్నారు. కేంద్ర సర్కారు, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటికైనా మృతుల సంఖ్య, వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా కల్పించిన భరోసా ఏమిటో తెలపాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఎంఐఎం కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యాక్సినేషన్‌కు కూడా కేంద్ర సర్కారు ఆలస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని, పంపిణీ ప్రక్రియ గందరగోళంగా ఉందని అసదుద్దీన్‌ విమర్శించారు. జులైలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామంటున్నారని, ఆ నెలలో ఉత్పత్తి సామర్థ్యమే 13.2 కోట్లు కాగా.. మిగిలిన 17 కోట్ల వ్యాక్సిన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని