తెరాసతో చర్చలు జరపలేదు: ఎల్‌.రమణ
close

ప్రధానాంశాలు

తెరాసతో చర్చలు జరపలేదు: ఎల్‌.రమణ

జగిత్యాల, న్యూస్‌టుడే: తెరాసతో తాను ఎలాంటి చర్చలు జరపలేదని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ చెప్పారు. పార్టీ మారడంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించి వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని 27 ఏళ్లుగా తెదేపా అప్పగించిన పనులను అంకితభావంతో ప్రజల కోసం పనిచేస్తున్నానని వివరించారు. జగిత్యాలలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్‌, చంద్రబాబులను నమ్ముకుని ముందుకు సాగానన్నారు. తెదేపా రాజకీయ విశ్వవిద్యాలయమని, తాను అందులో నిత్య విద్యార్థినని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని మారుతున్న రాజకీయాలకనుగుణంగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నానని, వేరే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని