కరోనా ఉద్ధృతికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం: భట్టివిక్రమార్క
close

ప్రధానాంశాలు

కరోనా ఉద్ధృతికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం: భట్టివిక్రమార్క

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కరోనా ఉద్ధృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. కొవిడ్‌ కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఎన్నికలు, కుంభమేళాలకు ప్రధాని మోదీ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయాంశాలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. భట్టివిక్రమార్క అధ్యక్షతన సోమవారం ‘కరోనా పరిస్థితులు.. తీసుకోవాల్సిన చర్యలు’ అన్న అంశంపై వెబినార్‌ జరిగింది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి సుజాతారావు, పలువురు వైద్య నిపుణులు, సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. మొదటిసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత.. మరోసారి రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకులు దృష్టి పెట్టలేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు లోపల, బయట ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ కరోనాపై హెచ్చరించినా మోదీ, కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మన దేశం వ్యాక్సినేషన్‌లో చాలా వెనకబడిందని పలువురు వక్తలు విమర్శించారు. థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలకు ముప్పు అధికంగా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని