ప్రభుత్వ భూముల వేలాన్ని తక్షణమే నిలిపేయాలి
close

ప్రధానాంశాలు

ప్రభుత్వ భూముల వేలాన్ని తక్షణమే నిలిపేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములను ప్రజావసరాలకు వినియోగించుకోవాలే తప్ప విక్రయించే అధికారం కేసీఆర్‌ ప్రభుత్వానికి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూముల వేలాన్ని తక్షణమే ఆపేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ఐఐసీ(పరిశ్రమ భవన్‌) ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ,.. ధనిక రాష్ట్రంలో భూములు అమ్ముకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. బంగారు తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. తన ఆర్థిక పాపాలను కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్‌ వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములను అమ్మితే సహించబోమని, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్‌ బోస్‌, నాయకులు ఈటీ నర్సింహా, ఆర్‌.శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని