కన్నడనాట నాయకత్వ మార్పుపై అభిప్రాయ సేకరణ
close

ప్రధానాంశాలు

కన్నడనాట నాయకత్వ మార్పుపై అభిప్రాయ సేకరణ

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ రాష్ట్ర మంత్రులతో బుధవారం సాయంత్రం సమీక్షించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరుకు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి యడియూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ నేతృత్వంలో 31 మంది మంత్రులతో మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాయకత్వ మార్పు అవసరమా అనే అంశంపై మంత్రులతో వేరువేరుగా చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో అరుణ్‌సింగ్‌ గురువారం సమావేశమవుతారు. ఈ రెండు సమావేశాల్లో చర్చించిన అంశాలపై శుక్రవారం కోర్‌ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని