కేసీఆర్‌-ఈటల కలహాలతో ప్రజలకు సంబంధం లేదు
close

ప్రధానాంశాలు

కేసీఆర్‌-ఈటల కలహాలతో ప్రజలకు సంబంధం లేదు

 మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌-ఈటల రాజేందర్‌ల మధ్య జరుగుతున్న కలహంతో ప్రజలకేమాత్రం సంబంధం లేదని, వారిద్దరూ ఒకేగూటి పక్షులని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్యూడల్‌ పెత్తనానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని ప్రకటన చేసిన రాజేందర్‌ వెెంటనే హిందుత్వ భాజపాలో చేరారన్నారు. మొన్నటి వరకు కేసీఆర్‌ పక్కన అధికారం అనుభవించిన ఆయన తన ఆస్తులు పెంచుకొనేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగానే పేదల అసైన్డ్‌ భూములను ఆక్రమించారని ఆరోపించారు. వాటి రక్షణ కోసమే భాజపాలో చేరారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని