తెరాస, ఈటల వర్గీయుల వాగ్వాదం
close

ప్రధానాంశాలు

తెరాస, ఈటల వర్గీయుల వాగ్వాదం

 కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: తెరాస, ఈటల వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో 189 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేసేందుకు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సుడా ఛైర్మన్‌ జీవీ.రామకృష్ణారావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయతో పాటు ఈటల మద్దతుదారు ఎంపీపీ సరిగొమ్ముల పావని హాజరయ్యారు. సమావేశానికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అధ్యక్షత వహిస్తుండగా ఎంపీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ నిలదీశారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డి జోక్యంతో జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఎంపీపీ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని