ఏపీ ప్రత్యేక హోదాపై ఏమీ చేయలేం
close

ప్రధానాంశాలు

ఏపీ ప్రత్యేక హోదాపై ఏమీ చేయలేం

కేంద్రాన్ని పదే పదే అడగగలమంతే: ఏపీ సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని పదేపదే అడగటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని, లోక్‌సభలో వారికి కావాల్సిన పూర్తి ఆధిక్యం ఉందని... దేవుడి ఆశీస్సులతో ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుందని కోరుకుంటున్నానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని... ప్రత్యేక హోదా ద్వారా అంతో ఇంతో ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూడగా, దాన్ని కూడా... లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం, ఓటుకు కోట్ల కేసు కోసం తాకట్టు పెట్టేశారని వ్యాఖ్యానించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగాల జాబ్‌ క్యాలెండర్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.  గతంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కేంద్రంలో రెండు మంత్రి పదవులు అనుభవించారని.. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడటంతో ఇప్పుడు దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాము విన్నవించుకోవాల్సి వస్తోందని అన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని