మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కిందనే సాగునీరు: పొన్నాల
close

ప్రధానాంశాలు

మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కిందనే సాగునీరు: పొన్నాల

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కిందనే ప్రస్తుతం సాగునీరు అందుతోందని నీటిపారుదల శాఖ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రారంభించింది కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులేనని అన్నారు. వీటికోసం రూ.97,300 కోట్లు ఖర్చు చేసినా కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదన్నారు.  
రాష్ట్రంలో అరాచక పాలన: దాసోజు శ్రవణ్‌
రాష్ట్రంలో దోపిడీ, అరాచక పాలన సాగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణలో భూములు అమ్మడం ఎందుకని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని