నైతిక అధికారం కోల్పోయిన మోదీ
close

ప్రధానాంశాలు

నైతిక అధికారం కోల్పోయిన మోదీ

కాంగ్రెస్‌ నేత సిబల్‌ విమర్శ

దిల్లీ: ప్రజలకు వైద్య సహాయం అవసరమైన సమయంలో వారి పక్షాన నిలవని ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలించేందుకు నైతిక అధికారాన్ని కోల్పోయారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడడుతూ నిస్సందేహంగా మోదీకి నైతిక అధికారం లేదని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహం రూపొందించడంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదని విమర్శించారు. ప్రజలు ఆసుపత్రుల బయట అవస్థలు పడుతున్న సమయంలో వారిని ఆదుకోవాల్సిన ప్రధాని అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలతో తలమునకలుగా ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఆయనే ఉల్లంఘించారని అన్నారు. వైఫల్యాలపై ఆత్మపరిశీలన జరుపుకోకుండా బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలపై వేస్తున్నారని చెప్పారు. భారత్‌కు టీకాల తయారీ కేంద్రంగా గుర్తింపు రావాల్సిన సమయంలో ఆక్సిజన్‌ కోసం అర్థించే దేశంగా మారిందని, ఇందుకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. తొలి దశ ఉద్ధృతి వచ్చిన తరువాత వైద్యపరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే దేశం భారీ మూల్యాన్ని చెల్లించిందని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని